తామా 11వ అర్థవార్షిక చెస్ టోర్నమెంట్ – రికార్డు స్థాయిలో పాల్గొన్న అట్లాంటా వాసులు
అట్లాంటా తెలుగు సంఘం తామా వారు 2020 ఫిబ్రవరి 15 న బిగ్ క్రీక్ ఎలిమెంటరీ పాఠశాలలో 11వ అర్థవార్షిక చెస్ పోటీలు నిర్వహించారు. ఇటువంటి రేటెడ్ మరియు అన్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ లను తామా గత 6 సంవత్సరాలుగా అప్రతిహతంగా నిర్వహిస్తోంది. ఈ పోటీలకు ఇండియన్ ఫ్లేవర్స్ రెస్టారెంట్ రాజ్ చామర్తి సమర్పకులు. పాత రికార్డులను తిరగరాస్తూ, 160 మందికి పైగా కిండర్ గార్టెన్ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు మరియు పెద్దలు పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్ స్విస్ పద్దతి లో 5 విభాగాలు (యు1500, యు1000, యు500, అన్రేటెడ్ మరియు పెద్దలు) మరియు టైమ్ కంట్రోల్ జి30 + 5 సెకండ్స్ డిలే ప్రకారంగా జరిగింది. ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమై సాయంత్రం 5 వరకు కొనసాగింది. మొత్తం 5 రౌండ్లు, ఉదయం 10,11 గంటలకు మరియు మధ్యాహ్నం 12:30, 2, 3:30 గంటలకు జరిగాయి. ఈ ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు ఎంతో క్రమబద్దతో పాల్గొన్నారు.
ప్రతి విభాగంలో మొదటి 5 మంది విజేతలకు మరియు ప్లస్ స్కోర్ వారికి సమర్పకులు, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు ట్రోఫీలు అందజేశారు. వివిధ విభాగాల విజేతలకు ట్రోఫీలు అందజేశారు మరియు పాల్గొనే వారందరికీ ధృవీకరణ పత్రాలు అందజేశారు. తామా వారు స్పాన్సర్ రాజ్ చామర్తిని ఘనంగా సత్కరించారు. ఆయన పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు మరియు మద్దతును తెలియజేశారు. పిల్లలు వారి తల్లిదండ్రులు మరియు ఇతర స్నేహితులతో ట్రోఫీలతోపాటు ఫోటోలు తీసుకున్నారు. పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అందరికీ తామా వారు పిజ్జా, మంచి నీరు మరియు టీ అందజేశారు.
తామా క్రీడలు మరియు యువత కార్యదర్శి రమేష్ వెన్నెలకంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు మాజీ ఛైర్మెన్ రాజేష్ జంపాల, శ్రీనివాస్ లావు, ప్రస్తుత చైర్మన్ రాజశేఖర్ చుండూరి, మాజీ అధ్యక్షులు వెంకీ గద్దె, అధ్యక్షులు భరత్ మద్దినేని, మహిళా కార్యదర్శి సునీత పొట్నూరు, సాంస్కృతిక కార్యదర్శి సురేష్ బండారు, కోశాధికారి భరత్ అవిర్నేని, సాహిత్య కార్యదర్శి శ్రీవల్లి కంసాలి, విద్యా కార్యదర్శి తిరు చిల్లపల్లి తమ తోడ్పాటు అందించారు. జార్జియా చెస్ డైరెక్టర్లు పార్నెల్ వాట్కిన్స్ మరియు జయశ్రీ శేఖర్ ఈ పోటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరించారు.
భరత్ తామా నిర్వహించే చెస్, వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్ వంటి రకరకాల ఆటలపోటీల గురించి వివరించారు. చెస్ సంవత్సరంలో రెండుసార్లు నిర్వహిస్తామనీ, రెండవదానికి ఇంకా ఎక్కువమంది వచ్చి జార్జియాలోనే ప్రముఖమైన టోర్నమెంట్ గా నిలపాలని పిలుపునిచ్చారు. రాజశేఖర్ తామా కార్యకలాపాలు మరియు తామా క్లినిక్ గురించి మాట్లాడారు. చివరగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేసిన స్పాన్సర్స్ ఇండియన్ ఫ్లేవర్స్ రెస్టారెంట్ రాజ్ చామర్తికి, డైరెక్టర్లు పార్నెల్ వాట్కిన్స్, జయశ్రీ శేఖర్ లకు, వాలంటీర్లు అంజయ్య చౌదరి లావు, అనురాగ్ బండ్ల, శ్రీకాంత్ పొట్నూరు, రాధాకృష్ణలకు, ప్లేయర్లకు, తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యానికి మరియు కోఆర్డినేటర్లకు తామా టీం తరఫున రమేష్ ధన్యవాదాలు తెలిపి ఘనంగా ముగించారు.
విజేతల వివరాలు –
అండర్ 1500:
జాషువా కారోల్, ప్రణవ్ దొంతినేని, తనీష్ రాజ్ ఉదయ్ కుమార్, మాధవ్ గోపి, విశ్రుత్ ఎలిశెట్టి
అండర్ 1000:
ఇషాన్ పాండియన్, వినేష్ దేవునూరి, సిద్దార్థ్ సంతోష్, యిన్ హంటర్, క్రితిక్ కలైవన్నన్
అండర్ 500:
రేయాన్ష్ బజ్జురి, తినయు క్యూయి, సాయి షయాంక్ మొహంతి, కుషాల్ మరింగంటి, మోహినీష్ మద్దినేని
అన్ రేటెడ్:
విక్రాంత్ సజ్జా, ఆర్యన్ షేక్, ఆర్యన్ గాంధి, హరన్ వైభవ్ సి కె, తేజస్ సింగ్ సుమిత్
అడల్ట్స్ :
మధు పెరుమాళ్ళ, కీర్తి సంచన, ఆండ్రూస్ ప్రజ్బైలా, సందీప్ నాగులపల్లి, ప్రమోద్ సంగవర్













