సూపర్-8కు భారత్… యూఎస్ఏ పై ఘన విజయం
టి20 వరల్డ్ కప్‌లో భారత్ సూపర్-8లోకి దూసుకెళ్లింది. అతిథ్య అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో సమష్టిగా రాణించిన టీమిండియా అమెరికాను చిత్తు చేసింది. సూర్యకుమార్ 50, శివంధూబె 29 పరుగులతో చెలరేగడంతో అమెరికా నిర్ణయించిన 110 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. దీంతో గ్రూప్-ఎలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేశాడు.
టాస్ ఓడి తొలుతగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు పడగొట్టిన హర్ష దీప్ అమెరికా నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన ఈ స్టార్ పేసర్ కేవలం 9 పరుగులు ఇచ్చాడు. ఇక అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (27) టాప్ స్కోరర్. స్టీవెన్ 24 పరుగులు చేయగలిగారు. మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీమిండియా బౌలర్లలో అర్ష్ దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.







