అమెరికా ఎన్నికల రేసులో భారతీయుడు
భారతీయ సంతతికి చెందిన పారిశ్రామిక వేత్త సునీల్ గుప్తా యూఎస్ కాంగ్రెస్‌లో స్థానం సంపాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేట్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించి మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా సునీల్ గుప్తా మాట్లాడుతూ తమ కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, గాంధేయ వాద మార్గంలోనే నడవాలని సూచిస్తూ ఉంటుందని అన్నారు. మీరు చేసే పనిలో ఇష్టం ఉండాలని, అప్పుడే అనుకున్నది సాధిస్తామని గుప్తా అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్లుగా మిచ్గాన్లోనే నివాసం ఉంటున్నానని, కార్పొరేట్ రంగంలో మార్పుల కోసమే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఫోర్డ్ మోటర్ కంపెనీ ఇంజినీర్ డిగ్రీ పొందిన మొట్ట మొదటి మహిళ తన తల్లి దమాయంతి గుప్తా అని వివరించారు. సోదరుడు సంజయ్ గుప్తా సీఎన్ఎన్లో హెల్త్ రిపోర్టర్‌గా పని చేస్తారని తెలిపారు. ఇటీవలే బెస్ట్ పారిశ్రామికవేత్తగా మెప్పుపొందినట్టు గుప్తా చెప్పారు. మిచిగాన్ జిల్లా 11వ కాంగ్రెష్నల్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి పోటీ పడుతున్నారు.













