రూ.405 కోట్లను వద్దనుకున్న గూగుల్ సీఈవో!
ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. కానీ తాను చేస్తున్న పనికి ఇప్పటికే ఎక్కువ జీతం వస్తోంది అదనంగా ఇంక అవసరం లేదు అనే వాళ్లను చూశారా? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అదే పని చేశారు. పిచాయ్ ప్రతిభను మెచ్చి గూగుల్ కంపెనీ అదనంగా ఇవ్వజూపిన రూ.405 కోట్లను ఆయన వదులుకున్నారు. తనకు ఇప్పటికే వేతనం రూపంలో కంపెనీ ఎక్కువగా ఇస్తోందని, అదనపు డబ్బు అవసరం లేదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీయీవోల్లో సుందర్ పిచాయ్ ఒకరు. ఆయనకు ఏడాదికి దాదాపు రూ.1300 కోట్లు వేతనం. ఆయన జీతాన్ని గూగుల్ కంపెనీ ఈ ఏడాది మళ్లీ సవరించనుంది.













