అరుదైన రికార్డు.. 21 ఏళ్ల తర్వాత అతనొక్కడే
యూఎస్ ఓపెన్ లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా అరుదైన రికార్డు నెలకొల్పాడు. తొలి రౌండ్ విజయంతో 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. దాంతో 1992 తర్వాత ఈ టోర్నీలో గెలుపొందిన అతి పెద్ద వయస్కుడిగా వావ్రింక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 38 ఏళ్ల ఐదు నెలలు. 1992లో అమెరికా స్టార్ జిమ్మీ కొరన్స్ 40 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌లో గెలిచాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఈ టోర్నీలో ఆడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ అతడి రికార్డు బ్రేక్ చేయలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన వావ్రింకా తొలి రౌండ్లో జపాన్ ఆటగాడు యొషిహిటో నిషియోక పై విజయం సాధించాడు. కాలి గాయం వేధిస్తున్నా లెక్క చేయకుండా పోరాడిన వావ్రింకా 7-6(5) 6-2, 6-4తో గెలుపొందాడు.













