AAA: ఎఎఎ మహాసభల్లో తమన్ సంగీత విభావరి
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మార్చి 28,29 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా (Phildelphia) ఎక్స్ పో సెంటర్లో మొదటిసారిగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహాసభల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, బిజినెస్ సదస్సులు, మీట్ అండ్ గ్రీట్ వంటి ఎన్నో కార్యక్రమాలు మహాసభల్లో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో హైలైట్గా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. సూపర్ హిట్టయిన్ పలు చిత్రాల్లోని పాటలతో తమన్ సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. ఈ మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.







