జనగణమణ గీతాన్ని పాడిన అమెరికా సింగర్
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మేటి సింగర్ మేరీ మిల్బెన్ జనగణ మణ గీతాన్ని ఆలపించారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆమె భారత జాతీయ గీతాన్ని పాడారు. సభకు హాజరైన జనం కూడా తనతో గొంతుకలిపి పాడడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జనం గొంతుల్లో ఉన్న ఆ అభిమానాన్ని చూడవచ్చు అన్నారు. భారత జాతీయ గీతాన్ని ఆలపించడం సంతోషంగా ఉందని సింగర్ మేఈ మిల్బెన్ తెలిపారు. ఇది ఎప్పటికీ మరిచిపోని రోజు అని ఆమె వెల్లడిరచారు. జనగణమణ పాడిన తర్వాత ఆ సింగర్ స్టేజ్ పై మోదీ కాళ్లకు పాదాభివందనం చేశారు.













