బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారత వ్యాక్సిన్ తయారీ సంస్థకి 150 మిలియన్ డాలర్స్
ప్రపంచం లోనే అత్యంత సంపన్నులు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ అధినేత శ్రీ బిల్ గేట్స్ కోవిద్-19 వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ 2021 మొదలులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్లు చప్పగా శ్రీ బిల్ గేట్స్ పేద ప్రజలకి సరిఅయిన వైద్యం అందించడానికి , చదువు చెప్పించి పేదరికాని నిర్మూలించడానికి స్థాపించిన బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భారత దేశానికి చెందిన ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థలలో ఒకటి, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా, పూణే సంస్థకి 150 మిలియన్ డాలర్ల నగదుని కరోనా వైరస్ వాక్సిన్ అధిక మోతాదులో తయారీ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇచ్చినట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది .
యాభై ఎలా క్రితం (50) గుర్రపుశాలగా ప్రారంభం అయినా సీరం సంస్థ ఇప్పుడు నిమిషానికి 500 వ్యాక్సిన్ మోతాదులను తయారు చేయగల హై-స్పీడ్ పరికరాల తో సంవత్సరానికి 1.5 బిలియన్ల వివిధ వ్యాక్సిన్ దోసులు తయారు చేస్తూ ప్రపంచంలో ప్రముఖ వైరస్ వ్యాక్సిన్ తయారీ సంస్థ గా మారిన సీరం సంస్థ మరియు వంటి వివిధ కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థల తో కలిసి అధిక మోతాదులో కరోనా వైరస్ వ్యాక్సిన్ నీ తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సీరం సంస్థ భారతదేశానికి మరియు పేద, మధ్యతరగతి దేశాలకు 3 డాలర్స్ అంటే సుమారుగా 210 రూపాయల ధర మించకుండా 100 మిలియన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ చేయడానికి ఒప్పుకుంది. ఇందుకు సీరం సంస్థ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల నగదుని అందుకున్నట్లు న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది. సీరంస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదార్ పూనావాళ్ళ మాట్లాడుతూ ఈ ఒప్పందానికి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం పేద , మధ్య తరగతి ప్రజలని కరోనా మహమ్మారినుంచీ రక్షించటమే అని అన్నారు.













