కరోనా బారినపడ్డ భారతీయులు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అమెరికాలో భారతీయులు అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అమెరికాలో మొత్తంలో ఈ రెండు రాష్ట్రాల్లోనే భారతీయులు ఎక్కువగా ఉన్నారు. తమ వారికి కరోనా సోకిందని భారతీయుల నుంచి తమకు ఫోన్‌కాల్స్ వస్తున్నట్లు ప్రవాస భారతీయు సంఘాల నేతలు చెప్పారు. ఈ సంఘాల నాయకుల్లోనూ అనేక మంది కోవిడ్ 19 సోకింది.
భారత సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడొకరు ఈ మహమ్మారి బారిన పడి ఐసీయలో చేరారు. హ్యూస్టన్‌లో పనిచేసే ఐటీ నిపుణుడు రోహన్ బావేడ్కర్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయనకు సహాయం చేయడానికి భారత అమెరికన్లు 2.04 లక్షల డాలర్ల మేర విరాళాలను సేకరించారు. రోహన్ బార్యకు ముగ్గురు సంతానానికి కోరా పాజిటివ్ వచ్చింది. ఈ వైరస్‌తో కేళరకు చెందిన నలుగురు భారత అమెరికన్లు మరణించారు. సిలికాన్ వ్యాలీలో భారత అమెరికన్ ఐటీ ఇంజీనీర్కు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. మయామీ వ్యాలీ ఆసుపత్రిలో హృద్రోగ విభాగంలో మెడికల్ డైరెక్టర్‌గా చేస్తున్న ముకుల్ ఎస్.చంద్ర వెంటిలేటర్‌పై ఉన్నారు.













