కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి భారత్ భేష్ : సుందర్ పిచాయ్
భారతీయ మార్కెట్ స్థాయి కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు గాను గూగుల్‌కు సహకరిస్తుందని, తదనంతరం ఇది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ అన్నారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబిసి) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశార. ఈ సదస్సు అనంతరం పిచాయ్‌కు, నాస్డాక్ అధ్యక్షుడు అదెనా ఫ్రెడ్మాన్కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పిచాయ్ మాట్లాడు అమెరికా భారత్‌లు కలిసి వ్యక్తిగత గోప్యతకు కావాల్సిన సురక్షిత ప్రమాణాలను తీసుకురాగలవని అన్నారు. చాలా రోజుల నుంచి గూగుల్ భారత్‌లో ఉండటంతో ఒక విషయం గమనించానని, భారతీయ ఉత్పత్తిదారులు చాలా పరికరాలను దేశీయంగానే రూపొందిస్తున్నారని అన్నారు. భారత ప్రభుత్వం కూడా విదేశీయంగా సాంకేతిక అభివృద్ధి పర్చడానికి అవసరమైన చర్యలు చేపట్టిందని, సరైన పాలన, ఆర్థిక, సామాజిక అంశాలను మెరుగుపర్చడం వంటివి చేసిందని అన్నారు.
భారత్ డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గినప్పుడు తామూ ఇక్కడి మార్కెట్లోకి రావాలనుకొన్నామని అన్నారు. అందుకోసం పూర్తిస్థాయిలో కృషి చేశామని, ఇప్పుడు తమ డిజిటల్ చెల్లింపుల ప్రొడక్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళుతున్నామని అన్నారు. భారత్‌ను నిర్మిస్తే ప్రపంచానికి సేవ చేయవచ్చని తెలిపారు.













