అమెరికాకు సౌదీ నుంచి తొలిమహిళా దౌత్యాధికారి
అవెరికాకు తమ దౌత్యాధికారిగా సౌదీఅరేబియా తొలిసారిగా ఒక మహిళను పంపించనుంది. దీర్టకాలం అమెరికా దౌత్యధికారి కొనసాగిన బండార్ బిన్ సుల్తాన్ ఆల్ సౌద్ కుమార్తె రీమా బింట్ బండార్ ఆల్ సౌద్ను సౌదీ ఈ మేరకు ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్న మాజీ పైలెట్, ఇస్తాంబుల్‌లోని దౌత్య కార్యాలయంలో వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జర్నలిస్ట్ ఖషోగి అదృశ్యమైన కేసులో అనుమానితుడు ప్రిన్స్ సల్మాన్ కుమారుడు ఖలీద్ బిల్ సల్మాన్ ఆల్ సౌద్ స్థానంలో సౌదీఅరేబియా ఆమెను నియమించింది. ఖలీద్ బిన్ సల్మాన్ ఆల్ సౌద్‌కు ఉపరక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నది. జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య అనంతరం అమెరికా సౌదీ అరేబియా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.













