డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన పాప్ సింగర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పాప్ సింగర్ రిహాన్నా షాకిచ్చింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం సందర్భంగా ర్యాలీలో తన పాటను వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. టెన్నెస్కోలోని చట్టనూగలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ర్యాలీలో రిహాన్నా పాడిన డోస్ట్ స్టాప్ ది మ్యూజిక్ గీతాన్ని నిర్వాహకులు ప్రసారం చేశారుప. దీంతో ట్విట్టర్ సాక్షిగా ట్రంప్, ఆయన అనుచరులపై రిహాన్నా మండిపడ్డారు. ఇలాంటి ద్వేషపూరితమైన ర్యాలీల్లో నేను కానీ, నా అభిమానులు కానీ పాల్గొనలేదు. ట్రంప్ మీ ర్యాలీల్లో నా పాటలేంటి? అని దుయ్యబట్టింది. తన అనుమతి లేకుండా తన ఆల్బమ్స్‌ను ప్రసారం చేసి నందుకు సదరు నిర్వాహకులకు రిహాన్నా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన ఫిలికర్ రక్కర్ అనే నెటిజన్‌కు ధన్యవాదాలు తెలిపారు.













