అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదు
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ వర్గం రష్యాతో గానీ, ఇంటెలిజెన్స్ సంస్థలతోగానీ కుమ్మక్కు కాలేదని అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలోని రిపబ్లికన్లు వెల్లడించారు. కాగా, వైట్ హౌస్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే కమిటీ ఈ విధమైన నిర్ణయానికి వచ్చిందని కమిటీలోని డెమోక్రాట్ నాయకుడు ఆడమ్ షిప్ ఆరోపించారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నదని, ట్రంప్‌ను గెలిపించడానికి కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రయత్నించాయని డెమోక్రాట్లు ఆరోపించడం, ఈ విషయమై విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.













