జుకర్ బర్గ్ కే షాక్ ఇచ్చిన ప్రియా వారియర్
ఒక్క కన్ను కొట్టి కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక ఆదార్ లవ్ మళయాళ చిత్రంలోని పాట మాణిక్య మలరాయ పూవీ పాటతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాందించుకుంది. రోజురోజుకి ఈ అమ్మడిని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఫాలోవర్స్ పరంగా ఇప్పటికే సన్నీలియోన్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలని క్రాస్ చేసిన ప్రియా వారియర్ తాజాగా ఫేస్బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌ని మించిపోయింది. ఆయనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే, ఈ 18 ఏళ్ళ కేరళ కుట్టికి 4.5 మిలియన్ల పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏదైనా పోస్ట్చేసిన లేదంటే వీడియో అప్లోడ్ చేసిన మిలియన్స్‌కి పైగా లైకులు, వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా సంచలనంగా మారిన ప్రియా రోజురోజుకి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతుంది. ఈ అమ్మడికి పలు సినిమాలో ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ లో నిఖిల్ సరసన నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుండగా, దీనిపై క్లారిట్ రావలసి ఉంది.













