ముగ్గురు అమెరికన్లకు ట్రంప్ స్వాగతం
ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విముక్తి పొంది స్వదేశానికి చేరుకున్న ముగ్గురు అమెరికన్లకు ట్రంప్ సాదర స్వాగతం పలికారు. వారిని తీసుకొచ్చిన విమానం గురువారం తెల్లవారుజాము ఆండ్రూస్ వైమానిక స్థావరంలో కిందకు దిగగానే, సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ విమానంలోకి ప్రవేశించారు. ముగ్గురు మాజీ బందీలతో ఉద్వేగంగా మాట్లాడారు. అత్యంత సంతోషంతో వారిని స్వదేశానికి స్వాగతించారు. దేశ విద్రోహ కుట్రలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న ముగ్గురు అమెరికన్లు కిమ్ డోంగ్ చుల్, కిమ్ హక్ సాంగ్, టోనీ కిమ్లను ఉత్తర కొరియా బుధవారం విడుదల చేసిన సంగతి గమనార్హం.













