ఆమె చరిత్రే అమెరికా చరిత్ర : జో బిడెన్
డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్పై అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ప్రశంసల వర్షం కురిపించారు. కమల చరిత్రే అమెరికా చరిత్ర అని పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ ఆయన పార్టీ సదస్సులో ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ అమెరికా చేసిన ప్రమాణాలను నెరవేర్చేందుకు నేను తదుపరి అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈ పని ఒంరిగా చేయబోవటం లేదు. నా వైపు గొప్ప ఉపాధ్యక్షురాలు ఉండబోతున్నారు. ఆమె చరిత్రే అమెరికా చరిత్ర. దేశంలో ఎదురైన సవాళ్లన్నీ ఆమెకు తెలుసు. ఎదురైన ప్రతిసవాలునూ అధిగమించారు అని ప్రస్తుతించారు. తనకు మద్దతు తెలిపిన మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు బిడెన్ కృతజ్ఞతలు తెలిపారు. జాతి వివక్షకు బలైన జార్జిఫ్లాయిడ్ కూతురు తనతో చెప్పిన నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు అనే మాటలు ఎన్నటికీ మర్చిపోనని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా మిత్రదేశాల తరపున బలంగా నిలబడతానని, నియంతలను దరిచేరనివ్వనని పరోక్షంగా చైనాను హెచ్చరించారు.













