లాస్ ఏంజెలిస్ లో ఘనంగా పాఠశాల వసంతోత్సవం
అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ 2019 వసంతోత్సవ వేడుకలను సదరన్ కాలిఫోర్నియాలోని ఇర్వింగ్ సెంటర్లో జూన్ 1వ తేదీన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. లాస్ఏంజెల్స్ పాఠశాల టీమ్‌తోపాటు, చిన్నారులు, తల్లితండ్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు తరలివచ్చారు. దాదాపు 2 గంటలసేపు సాగిన వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల చివరి భాగంలో ఏరియా కో ఆర్డినేటర్ శ్రీధర్ సాతులూరి వెలుగు కోర్స్‌లో ఉత్తీర్ణులైన స్టూడెంట్స్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ వారు అందించిన సర్టిఫికెట్లను బహూకరించారు. టీచర్లు వాణి కందిపతి, శిరీష రంగరాజు అల్లాని, స్వాతి బృందావనం, రాజేష్ దొప్పాలపూడి, ప్రణవి కందెపు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. చివరగా పాఠశాల యాజమాన్యం వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, 2019-20 సంవత్సరానికి పాఠశాల అడ్మిషన్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.













