శాక్రమెంటోలో సిఎఎకి మద్దతు తెలిపిన ఎన్నారైలు
భారత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ కి మద్దతుగా కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని అయిన శాక్రమెంటో అసెంబ్లీ ఎదుట ఎన్నారైలు 200 మంది మద్దతుదార్లతో ర్యాలీ నిర్వహించారు. సీఏఏను సమర్థిస్తూ ప్లేకార్డులతో ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని అందరూ స్వాగతించాలని ర్యాలీకి తరలివచ్చిన ఎన్నారైలు పిలుపు ఇచ్చారు. పొరుగు దేశాలలో ఉన్న మైనారిటీలు అక్కడి జాతి వివక్షతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, మతపరమైన హింసను ఎదుర్కొని వలసవచ్చిన వాళ్లకు ఒక చట్టం అన్నది లేకుండా పోయిందని.. వాళ్లందరిని భారత్ లో చట్టబద్దమైన పౌరులుగా ఆహ్వానిద్దామని ర్యాలీకి హాజరైన పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. సీఏఏ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మీడియా ఎలా చూపిస్తుందో, అలాగే సీఏఏ కి మద్దతు తెలుపుతున్నవారిని కూడా మీడియా చూపించాలని వారు కోరారు.













