తిత్లీ తుఫాన్ బాధితులకు NRI TDP సాయం
ఆంధ్ర రాష్ట్రం లో తిత్లీ తుఫాన్ చేసిన నష్టానికి అమెరికా లో ఉన్న NRI TDP వెంటనే స్పందించింది. తక్షణ సాయంకోరకు విరాళాలు కలెక్ట్ చేసి, సహాయ చర్యలు చేపట్టింది. విశాఖ నుంచి, శ్రీకాకుళం నుంచి అక్కడ ఉన్న స్థానికుల ద్వారా వరద బాధిత గ్రామాలకు ట్రక్ ల ద్వారా మంచి నీటి bottles, ఆహారం, బట్టలు వెంటనే పంపించింది. గత రెండు రోజులు గా జరుగుతున్న ఈ సహాయ కార్యక్రమం ఇంకా కొనసాగుతాయి అని తెలిసింది.
ఆదివారం ఉదయం తెలుగు దేశం M P శ్రీ రామ్మోహన్ నాయుడు అమెరికా లోని టీడీపీ కార్యకర్తలతో 20 నిముషాల కాన్ఫరెన్స్ కాల్ లో జరిగిన నష్టాన్ని, జరగ వలసిన చర్యలను వివరించారు. NRI లను ఉద్దేశిస్తూ ఒక వీడియో ప్రకటన ద్వారా సహాయం చెయ్యమని కోరారు.
ఈ కాన్ఫెరెన్సు కాల్ లో NRI టీడీపీ నుంచి శ్రీయుతులు వెంకట్ కోగంటి, మురళి వెన్నం, ఉప్పుటూరి రాం చౌదరి, సతీష్ మేక, సుమంత్ పులుసూరి, రత్న ప్రసాద్ గుమ్మడి మాట్లాడారు.
NRI TDP వరద బాధితులకు తక్షణ సహాయం చేయటమే కాక, విరాళాలు తెచ్చి వరద బాధితుల పునరావాస చర్యలలో కూడా తమ వంతు సహాయం చేస్తుందని శ్రీ వెంకట్ కోగంటి తెలిపారు.













