డొనాల్డ్ ట్రంప్ చెబితే టీకా వేసుకోను : హారిస్
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు చెబితే తీసుకుంటానని, కానీ అధ్యక్షుడు ట్రంప్ చెబితే మాతం టీకా తీసుకోబోనని ఆయన మీద నమ్మకం లేదని డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కమలా హారిస్, మైక్ పెన్స్ (రిపబ్లికన్) మధ్య వాడివేడిగా సంవాదం జరిగింది. కొవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో ట్రంప్ విఫలమయ్యారని కమల ఆరోపించగా, ట్రంప్ తీసుకున్న చర్యల వల్లనే లక్షలాది మంది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందంటూ పెన్స్ సమాధానమిచ్చారు. సంవాదం జరుగుతున్న సమయంలో ఒక ఈగ మైక్ పెన్స్ తలపై వాలి రెండు నిమిషాలు అలాగే ఉండిపోయింది. అనుకోని అతిథి వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.













