అమెరికా- ఉత్తరకొరియా చర్చలు?
ఒరు మొండి అయితే ఇంకొకరు జగమొండి. ఒకరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే మరొకరు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్. వారిద్దరూ ఇప్పుడు శాంతి వచనాలతో చర్చలు జరపనున్నారా? అవును అనే సమాధానం వస్తోంది. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ఛాంగ్ మంచు పర్వతశ్రేణులలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్, 2018 ముగింపు వేడుకలలో పాల్గొనేందుకు ఉత్తర కొరియా అధికార బృందం వెళ్ళనుంది. అమెరికా ఉత్తరకొరియాతో చర్చలు జరపాలనుకుంటే ఇంత కన్నా మంచి వేదిక దొరకదని దక్షిణకొరియా పేర్కొంది. ప్యాంగ్ఛాంగ్ పర్వత శ్రేణులతో రహస్య ప్రాంతంలో అమెరికా ఉత్తరకొరియా చర్చలు జరిపేందుకు తాము ఏర్పాట్లు చేయగలమని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జాం ఇన్ అమెరికాకు పరోక్షంగా సూచించారు. అయితే దక్షిణ కొరియా ప్రతిపాదనపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇప్పటికే వింటర్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న అమెరికా క్రీడా బృందానికి సహాయం చేసేందుకు అమెరికా అధికారులు దక్షిణకొరియాలో ఉన్నారు. అమెరికా సానుకూలంగా స్పందించే ఇరుదేశాల అధ్యక్షుల మాటల యద్థు తర్వాత జరగబోయే మొదటి చర్చలు కానున్నాయి.













