అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక
అమెరికా విధించిన ఆంక్షలను సడలించని పక్షంలో అణ్వాయుధాల తయారీకి ఉపక్రమిస్తామని ఉత్తర కొరియా అమెరికాను హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సింగపూర్‌లో సమావేశమై పలు అంశాలను చర్చించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షలు సడలించుకుండా సమయాన్ని వృథా చేస్తోందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా వైఖరిలో మార్పురాని పక్షంలో అణ్వాస్త్రాల తయారీకి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రంప్‌తో కిమ్ సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా, ఇంతవరకు అమెరికా నుంచి ఆంక్షల సండలింపుపై సానుకూల స్పందన రాలేదన్నారు. అమెరికా ఆంక్షల సడలింపుపై జాప్యం చేయడంలో ఉత్తరకొరియా ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతోంది. దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన చెందిన దాదాపు 28500 మందిసైనికులు ఉన్నారు. ఐరాస తీర్మానం మేరకు ఉత్తరకొరియాపై అమెరికాలో పాటు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి.













