అమెరికా నుంచి తొలి ప్రైవేటు విమానం
లాక్డౌన్ తర్వాత తొలిసారిగా అమెరికా నుంచి ప్రైవేటు విమానం దేశంలో అడుగు పెట్టనుంది. అది కూడా తెలుగువారి కోసమే ఏర్పాటు చేసిన తొలి అంతర్జాతీయ సర్వీసు కావడం గమనార్హం. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటలకు 450 మంది ప్రయాణికులతో బయలుదేరనున్న విమానం, 11వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇప్పటి దాకా నాలుగైదు వేలమందిని తరలించారు. అమెరికా లోని తెలుగువారిని తరలించేందుకు యూఎస్ సాలిడార్టీ మిషన్ చొరవ తీసుకొని, ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా నుంచి టిక్కెట్ ధర రూ.1.66 లక్షల నుంచి రూ.1.81 లక్షల మద్య ఉంటుందని నిర్వాహకులు పులి రవి తెలిపారు. www.usism.org/registerprivatecharterflight.html అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అమెరికా, భారత్‌కు దరఖాస్తు చేసుకున్న వారే టికెట్ బుకింగ్‌కు అర్హులని తెలిపారు.













