కొలంబియా అప్పీళ్ల కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్
భారత సంతతికి చెందిన నియోమిరావు శక్తివంతమైన న్యాయమూర్తిగా అమెరికా సెనేట్ ధ్రువీకరించింది. లైంగిక దాడి కేసులకు సంబంధించి గతంలో ఆమె రాసిన తీర్పులు ప్రశంసలు పొందాయి. దీంతో దేశంలో అత్యంత శక్తివంతమైన అప్పీలేట్ కోర్టులలో ఒకటైన డిసి సర్కూట్ కోర్టుకు జడ్జిగా నియోమి రావు పేరు పరిశీలనలో ఉంది. గత ఏడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన వివాదాస్పద బ్రెట్ కవానాగ్ స్థానంలో 45 ఏళ్ల మహిళా న్యాయమూర్తి రావును నియమించనున్నారు. ఆమె నియామకాన్ని 53-46 ఓట్ల తేడాతో సెనేట్ ధ్రువీకరించింది. సుప్రీంకోర్టు తర్వాత న్యాయస్థానంగా పరిగణించే ఈ కోర్టుకు నియమితులైన రెండో భారత సంతతి న్యాయమూర్తిగా ఆమె పేరుగాంచనున్నారు. నియోమీ ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యవహారాల కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఆమె జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా వ్యవహరించారు.













