చికాగోలో నాట్స్ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్ ఇటీవల చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు ఈ టోర్నమెంట్లో తమ క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆద్యంతం ఎంతో రసవత్తవరంగా సాగిన ఈ టోర్నమెంట్ లో ఎవోలూటీజ్ లయన్స్ టీం ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అరోరా వారియర్స్ రన్నర్స్ గా నిలిచింది.
నాట్స్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ హరీష్ జమ్ముల ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ ఎంతో చక్కగా నిర్వహించబడిరది. చికాగో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జా, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, బిందు వీదులమూడి, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణకు అందించిన సహకారం చాలా అమూల్యమైంది. ఈ టోర్నమెంట్ కోసం స్వచ్ఛందంగా సేవలు అందించిన నాట్స్ వాలంటీర్లు రాజేష్ వీదులమూడి, ఆర్.కె బాలినేని, పండు చెంగలశెట్టి, శ్రీనివాస్ బొప్పన, కృష్ణ నున్నా, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, యాజ్నేష్ వెంకటేష్, కార్తీక్ మోదుకూరి, నరేన్ శర్మ, నరేష్ యాదా, వినోద్ బాలగురు, మనోహర్ పాములపాటి, రామ్ తూనుగుంట్ల తదితరులకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.













