హ్యూస్టన్ లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల సందడి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఘనంగా డల్లాస్ లో నిర్వహిస్తున్న ఆరవ అమెరికా తెలుగు సంబరాల సందడి హ్యూస్టన్ మహానగరంలో మొదలైంది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో హ్యూస్టన్ నాట్స్ సభ్యులు, నగరంలోని వివిధ సంఘాల ప్రముఖులు పాలుగుని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులు విచ్చేసి సంబరాల వివరాలు, విశేషాలు హ్యూస్టన్ వారితో పంచుకుని అందరిని ఆహ్వానించారు.
కార్యక్రమంలో జరిగిన సంగీత, నాట్య ప్రదర్శనలు అందరిని అలరింపజేశాయి. తన మాటల చతురతతో వ్యాఖ్యాత, శైలజ గ్రంధి, కమనీయమైన గానంతో కార్తీక్, అందరిని అలరింపజేశారు. ఈ సందర్భంగా నాట్స్ సౌత్ సెంట్రల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్ల గారు సంబరాలు గురించి, వివిధ స్పాన్సర్ ప్యాకేజీల గురించి విపులంగా వివరించారు. నాట్స్ హ్యూస్టన్ విభాగ కోఆర్డినేటర్, శ్రీనివాస్ కాకుమాను గారు హ్యూస్టన్ నాట్స్ చేస్తున్న వివిధ సేవ కార్యక్రమాల గురించి అందరితో పంచుకుని అందరిని డల్లాస్ సంబరాలకి తప్పకుండా రమ్మని ఆహ్వానించారు.
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు రాము ఉప్పలపాటి, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ట్రస్టీ జగపతి వీరాటి, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ తోట మరియు కార్యవర్గ సభ్యులు, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు అఫ్ డైరెక్టర్, శ్రీధర్ కంచనకుంట్ల, ITServe హ్యూస్టన్ అధ్యక్షులు నరేందర్ మొండలరెడ్డి, ప్రముఖ హ్యూస్టన్ గాయని శారదా ఆకునూరి మరియు వివిధ సంఘాల ప్రముఖులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
ఈ సందర్భంగా నాట్స్ హ్యూస్టన్ విభాగం విరాళాలు ప్రకటించిన దాతలు ప్రతి ఒక్కరికి తమ ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తోంది.













