మేరీలాండ్ లో నరేన్ కొడాలి టీమ్ ప్రచారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021-23 ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న నరేన్ కొడాలి తన ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా మేరీలాండ్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నరేన్ కొడాలి మాట్లాడుతూ, సరికొత్త తానా కోసం, కమ్యూనిటీకి మరింతగా సేవ చేసేందుకు వీలుగా తమ ప్యానెల్‌ను గెలిపించాల్సిందిగా కోరారు. కోవిడ్ కారణంగా కొద్దిమందిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించారు. వచ్చినవాళ్ళంతా తమ సంపూర్ణమద్దతును తెలియజేయడంతోపాటు నరేన్ ప్యానెల్ గెలుపుకు కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నరేన్ కొడాలితోపాటు, అనిల్ ఉప్పలపాటి, సత్యనారాయణ మన్నె, విజయ్ గుడిసేవ తదితరులు పాల్గొన్నారు.














