అమెరికాలో కోమా నుంచి బయటపడిన తెలుగు విద్యార్థిని
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు(25) కోమా నుంచి బయటికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిరచాయి. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. గత వారం నుంచి వెంటిలేటర్ అవసరం లేకుండా ఆమె శ్వాస తీసుకుంటుంది. నిజంగా అద్భుతం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగవడంతో వెంటిలేటర్ సదుపాయాన్ని తొలగించారు. వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సుశ్రూణ్య కుటుంబ సభ్యులకు వీసా లభించిందని, వచ్చే వారం వారు హైదరాబాద్ నుంచి అమెరికాకు చేరుకుంటారిన ఆమె బంధువులు సురేంద్రకుమార్ తెలిపారు. జులై మొదటివారంలో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో సుశ్రూణ్య పిడుగుపాటుకు గురై పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ గోఫండ్‌మీ ని ఏర్పాటు చేశారు.













