వాళ్లని వెనక్కి పంపివేయాల్సిందే : ట్రంప్
వివిధ దేశాలకు చెందిన సుమారు 5,200 మంది ప్రజలు మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అమెరికా సరిహద్దు విభాగం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరంతా తిజువానాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులందరినీ తమ తమ దేశాలకు పంపివేయాలంటూ మెక్సికో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు శరణార్థులు కారని, అమెరికాలో అక్రమంగా చొరబడి ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తున్న ఆశావాదులని షూటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని అమెరికా ఎప్పుడు కేవలం ఆర్థిక వలసదారులుగా మాత్రమే పరిగణిస్తుందని, శరణార్థులుగా గుర్తించదని ఉద్ఘాటించారు. అంతేకాకుండా వలసదారులపై తమ అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారన్న వార్తల్ని కొట్టిపారేశారు. హోండురస్లోని పరిస్థితులను తమ దేశానికి ఆపాదిస్తూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.













