ఫేస్బుక్ పట్టిందల్లా బంగారమే!
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. సోషల్ మీడియాతో అగ్రగామిగా దూసుకుపోతుండడంతో ఆయన సంపద పట్టపగ్గాల్లేకుండా దూసుకెళుతోంది. తాజాగా ఒక్కరోజులోనే ఆయన ఖాతాలో 3.8 బిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.25 వేల కోట్లు. ఆదాయంపై సానుకూల నివేదిక వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షేర్లు అమాంతం 4శాతానికి పైగా ఎగిసిపడ్డాయి. షేరు ధర రికార్డు స్థాయిలో 173 డాలర్లకు చేరింది. తాజా గణాంకాల ప్రకారం జుకెర్ సంపద 72.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఐదో స్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది.













