ఏజెంట్ చేతిలో మోసపోయిన కార్మికునికి అండగా నిలిచిన మలేషియా తెలంగాణా అసోసియేషన్
ఇటీవల మలేషియా వచ్చిన కార్మికుడు ఏజెంటులా చేతులో మోసపోయి చిత్రవధ అనుభవించి ఎట్టకేలకు మలేషియా తెలంగాణ అసోసియేషన్ అండతో హైదరాబాద్ చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే మద్దెల మహేందర్ ఇండియా ఏజెంట్ రవి మాయమాటలు చెప్పి విజిట్ పైన మలేషియా కి పంపించాడు. మలషియా వచ్చిన తరువాత మలేషియా ఏజెంట్ మహేందర్ దగ్గర వున్న డబ్బులు తీసుకొని అతనికి నెలసరి జీతం తక్కువగా ఇస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. చివరకు మహేందర్ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి ద్వారా ఇండియన్ హై కమిషన్ సహాయంతో ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నాడు.
మలేషియా రావాలని అనుకునేవాళ్లు ఏజెంట్ ల చేతులలో మోసపోకుండా వచ్చే ముందు మలేషియా తెలంగాణ అసోసియేషన్ info@myta.com.my ను సంప్రదించాల్సింది గా మైట జనరల్ సెక్రటరి రవి వర్మ కోరారు.













