MGMNT ఆధ్వర్యం లో ఘనంగా మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు
మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6 వ తేదీ, ఆదివారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీ కి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని ప్రకటించారు.
ఈ వేడుకలలో భాగంగా శాంతి కి సంకేతం గా 15 తెల్లటి పావురాలను గాలిలోకి వదులుతామని, ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో “గాంధి శాంతి యాత్ర” జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. బ్రేక్ ఫాస్ట్ , టి షర్ట్స్, కేప్స్, అందజేయబడతాయి. గాంధి మెమోరియల్ కు సమీపం లో ఉన్ననార్త్ లేఖ్ కాలేజ్ నుండి గాంధి మెమోరియల్ కు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, తమ కార్లను అక్కడ పార్క్ చేసి ఉదయం 7:30 నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.
గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు – డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్ మరియు ఆహ్వ్వన కమిటీ సభ్యులు – మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్ లు వివిధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని వివరాలకు www.mgmnt.org ను చూడవచ్చు













