హ్యూస్టన్ నగరంలో ఘనంగా లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి కల్యాణ వైభవం విదేశాల్లో కొనసాగుతుంది. యాదాద్రి క్షేత్రం ఆలయం నుండి గత నెల రోజులుగా అమెరికాలోని తెలుగు ప్రజల కోరిక మేరకు పలు ప్రాంతాల్లో లక్ష్మీ నరసింహుని కల్యాణ మహోత్సవాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. అమెరికా దేశంలో ఉన్న తెలుగు వారు ఎంతో భక్తి పరవశంతో సమూహంగా ఏర్పడి శ్రీ రామ జయనికేతన్ ఆధ్వర్యంలో హుస్టన్ సిటీ నగరంలో శ్రీ లక్ష్మీ నరసింహుని కల్యాణోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.
ఆదివారం ఉదయం అమెరికాలో యాదాద్రి దేవాలయ అర్చకులైన వెంకటాచార్యులు, రంగాచార్యులు స్వామి వారి కల్యాణాన్ని ఎంతో కనువిందుగా తెలుగువారే కాకుండా లక్ష్మీ నరసింహుని భక్తులు తిలకిస్తుండగా బ్రహ్మండంగా నిర్వహించారు. తాము దేశాలు దాటిన దైవ భక్తి మరిచిపోలేమని తెలుగువారంతా ఒక్కటై స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి శ్రీరామ జయనికేతన్ శ్రీ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఇట్టి ఏర్పాట్లను చేశామని ఇందులో యాదాద్రి అర్చకులు పాల్గొని అత్యంత ఘనంగా కన్నుల నిండు స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం అందులో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో మధురమైన అనుభూతిగా వారు తెలిపారు.













