కుబేరులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అమెరికన్ మోడల్
అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ వయసు 20 ఏళ్లు మాత్రమే. కైలీ ఏం చేస్తే అదే ఫ్యాషన్. యువత బ్లైండ్‌గా అమె స్టైల్‌ను ఫాలో అయిపోతుంటారు. రెండేళ్ల క్రితం కైలీ కాస్మోటిక్స్ పేరిట ఓ సంస్థను ప్రారంభించగా, అది కాస్త 630 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత 100 పర్సంట్ పేరిట లిప్ కిట్ (29 డాలర్లకు కిట్) అమ్మకాల బిజినెస్‌ను ప్రారంభించి, రెండేళ్లలో గణనీయంగా ఆదాయాన్ని వెనకేసుకుంది.
ప్రస్తుతం ఆమె ఆదాయం టాక్స్ వినహాయింపులుపోనూ సుమారు 900 మిలియన్ డాలర్లపై (భారత కరెన్సీలో 6వేల కోట్లకు పై మాటే). ఈ మేరకు ఫోర్బ్స్ మాగ్జైన్ ప్రత్యేక శీర్షికలో ఆమె గురించి ఓ వ్యాసం ప్రచురించింది. యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ యూఎస్ బిలినియర్ పేరిట కైలీ గురించి ఆ ప్రత్యేక కథనం ప్రస్తావించింది. గతంలో ఈ రికార్డు ఫేస్బుక్ యజామాని మార్క్ జుకర్‌బర్గ్ (23) పేరిట ఉండగా, ఇప్పుడు కైలీ(20)ఆ రికార్డు బద్దలు కొట్టింది. కైలీ ప్రముఖ మోడల్, నటి కిమ్ కర్దాషియన్‌కు బంధవు. ట్రావిస్ స్కాట్‌తో రిలేషన్ షిప్లో ఉన్న కైలీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పలు టీవీ షోలు, సినిమాల్లో సైతం నటించిన ఈ యంగ్ మోడల్‌కు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.













