కిమ్ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్
ఉత్తర కొరియా అణు ప్రయోగాలు నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది ఉత్తర కొరియాకు, ప్రపంచానికి చాలా మంది వార్త అని అన్నారు. ఇది చాలా పెద్ద పురోగతి అని అన్నారు. కిమ్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. మే లేదా జూన్‌లో ట్రంప్, కిమ్‌ల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతున్నందున తమ దేశంపై అధికంగా ఉన్న ఆంక్షలను తొలగించుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భావిస్తున్నారని దక్షిణ కొరియా, అమెరికా అధికారులు అంటున్నారు. అలాగే ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయాన్ని సృష్టం చేసింది. ఉత్తర కొరియా దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా శ్రద్ధ చూపాలనుకుంటోందని పేర్కొంది.













