కొరియా సంధి గ్రామంలో ట్రంప్- కిమ్ భేటీ!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తన భేటీకి వేదికగా ఉభయ కొరియాల సరిహద్దుల్లోని సంధి గ్రామం పన్ముంజోమ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. తమ భేటీకి వేదికలుగా చాలా దేశాలు పరిశీలనలో ఉన్నాయని, అయితే, వేరే దేశాలపై ఆధారపడటానికి బదులుగా కొరియా సరిహద్దుల్లో పన్ముంజోమ్ గ్రామంలోని శాంతిగృహంలో సమావేశం జరిగితే బాగుంటుందని భావిస్తున్నానని ట్విటర్లో ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్తో కిమ్ చరిత్రాత్మక భేటీ శాంతిగృహంలోనే జరిగింది. మరోవైపు, శ్వేతసౌధ అధికారులు మాత్రం ట్రంప్-కిమ్ భేటీకి వేదికలుగా సింగపూర్, మంగోలియా తదితర దేశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పన్ముంజోమ్లో వారి సమావేశం జరిగే అవకాశాలను దాదాపుగా కొట్టిపారేశారు.













