ప్రపంచానికి తెలంగాణ పదాన్ని పరిచయం చేసిన ఘనత కేసీఆర్‌దే..
ప్రపంచానికి తెలంగాణ పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అమెరికా నార్త్ కరోలినాలోని చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ సభలకు మంత్రి జగదీష్‌రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ 28 రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా మారిందన్నారు. 17శాతం గ్రోత్తో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ సారధ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధలను యావత్ భారతదేశం అదర్శంగా తీసుకుంటున్నదన్నారు. మూడున్నర వేల జాతులలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఎవరికీలేని బతుకమ్మ మన సొంతమని అన్నారు.
అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్న తెలంగాణ బిడ్డలు అభినందనీయులని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలకు ఎన్ఆర్ఐలు తోడ్పాటును అందించాలని కోరారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వృత్తులు మారుతున్నాయని, దానికి అనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.













