అధ్యక్ష ఎన్నికలకు యుద్ధం షురూ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తెరలేచింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్న జోయ్ బిడెన్, కమలా హ్యారిస్‌లు డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన బిడెన్, భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు బిడెన్-హ్యారీస్ జోడి తీవ్ర పోటీ ఇవ్వనున్నది. అధ్యక్ష, ఉపాధ్య ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. డాక్యుమెంట్లపై సంతకాలు చేసిన తర్వాత బిడెన్, కమలా హ్యారిస్‌లు మీడియాతో మాట్లాడారు. కమలా హ్యారిస్‌కు టికెట్ లభించడం లాంఛనప్రాయం కావడంతో అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నల్లజాతి మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.













