Vanguri Foundation of America: 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ – ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: ఫిబ్రవరి 19, 2026)
గత మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది (మార్చి 19, 2026) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ కి అముద్రిత నూతన రచనలు ఆహ్వానిస్తున్నారు. భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల రచయితలూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. నూతన సాహిత్య సృష్టి కోసం నిర్వహించబడుతున్న స్నేహపూర్వకమైన ఈ “పోటీ” లో మూడు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం-ప్రపంచ రచనల పోటీ
(రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, సొంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనలతో బాటు విధిగా జత పరచాలి.)
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ $200 US డాలర్లు
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ $200 US డాలర్లు
“మొట్టమొదటి రచనా విభాగం” 19వ సారి నిర్వహణ
కథలూ, కవితలూ వ్రాద్దామని కుతూహలంతో చిన్నా, పెద్దా ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలు ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నారు. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. పోటీకి పంపిన రచన తమ మొట్టమొదటి అముద్రిత స్వీయ రచన అని హామీ పత్రం విధిగా జత పరచాలి.
“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ): $116 US డాలర్లు
“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కథ): $116 US డాలర్లు
యువతరం విభాగం- 5వ సారి నిర్వహణ
ప్రపంచవ్యాప్తంగా ఈ నాటి తెలుగు యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సు లో ఉన్న యువతీ యువకులను తమదే అయిన ఈ ప్రత్యేక విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనలతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) విధిగా జతపరచాలి.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ $116 US డాలర్లు
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ $116 US డాలర్లు
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
· ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. ఒక రచయిత అర్హత ఉన్న అన్ని విభాగాల్లోనూ పాల్గొనవచ్చును.
· రచనలు యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపు ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే. చేతి వ్రాతతో పంపిన రచనలు పరిగణింపబడవు.
· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.
· రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, సొంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచన అని హామీ పత్రంలో పేర్కొనాలి.
· బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లో, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
· విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు అనగా… మార్చ్ 19, 2026 నాడు కానీ అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.
· విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries: February 19, 2026
పోటీ రచనలు, హామీ పత్రం, తదితర వివరాలు ఈ క్రింది Google Form లో మాత్రమే పంపించాలి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnPKgC8XWztFYLLQhi-CnZO7cHa3DNWElUhNgOPeE-Zd1fXA/viewform
వివరాలకు ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించగలరు.
శాయి రాచకొండ (1 281 235 6641): దీప్తి పెండ్యాల (1 513 827 7790) వంగూరి చిట్టెన్ రాజు (1 832 594 9054)
Email: vangurioundation@mail.com






