ఇండో అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇండో అమెరికన్లు ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది. దీనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ కీలక అంశాలు కారణం అని సృస్టం అయింది. ఈ పన్నెండు అంశాలలో ప్రధానమైనది భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ చెట్టాపట్టాల్, ఆయనతో స్నేహబంధం అని ఓ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఆదిలో వీసాలు, ఇతరదేశస్థుల అమెరికా ప్రవేశాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికా లోని భారతీయుల ఓట్లు ట్రంప్‌ను ఈసారి వరించబోవని, ఇవి ప్రతిపక్ష అభ్యర్థికే పడుతాయని భావిస్తూ వచ్చారు. అయితే పలు కారణాలతో ట్రంప్ పట్ల అత్యధిక సంఖ్యలో ఇండో అమెరికన్ ఓటర్లు మొగ్గుచూపుతున్నారని, సాధారణంగా డెమోక్రాట్లకు అనుకూలత చూపే రాష్ట్రాల్లోనూ తేడా వచ్చిందని వెల్లడైంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రచారశైలిలో ఇండో అమెరికన్ల పట్ల గౌరవం చూపడం, భారత దేశం అంటే తనకు అత్యంత గౌరవం, ప్రధాని మోదీ అంటే తనకు విశిష్ట అనుబంధం ఉందని చెప్పడం, ఇందులో భాగంగానే తాను సకుటుంబంగానే గుజరాత్లో రోడ్‌షో వంటి జాతరకు కూడా హాజరయ్యానని, అక్కడి జనసందోహం నుంచి వ్యక్తం అయిన కేరింతలు అభిమానం తనక ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని, లక్షలాది మందిని ఒకే చోట చూడటం తనవంటి అమెరికన్‌కు ఆదే తొలిసారి అని తేల్చి చెప్పారు. బిడెన్‌తో పోలిస్తే ఇప్పుడు ట్రంప్ ఇండో అమెరికన్ల ఓట్ల విషయంలో కొంచెం ముందంజలో ఉన్నారని సర్వేలో తేల్చారు.













