హెచ్1బీ వీసాల్లో మనమే ఎక్కువ
అమెరికా జారీ చేస్తున్న హెచ్1బి వీసాల లబ్ధిదారుల్లో అత్యధికులు మన భారతీయులే ఉన్నారు. 2016లో జారీ చేసిన మొత్తం హెచ్1బి వీసాల్లో భారత్ నుంచి వెళ్లిన ప్రొఫెషనల్సే 74.2 శాతం వీసాలను పొందారు. 2017లో ఇది 75.6 శాతానికి చేరింది. ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. 2016, 2017లో హెచ్1బి వీసాల్లో చైనా వరుసగా 9.3 శాతం, 9.4 శాతాన్ని పొందింది. అయితే కొత్తగా జారీ చేసిన హెచ్1బి వీసాల్లో మాత్రం భారత్ నుంచి పొందిన వారిలో తగ్గుదల కనిపించిందని అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తమ నివేదికలో పేర్కొంది.













