డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారపర్వంలో తెలుగువాళ్ళు
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారరంగంలోకి ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు రంగంలోకి దిగారు. అందులో ఇద్దరు తెలుగువాళ్ళు ఉన్నారు. ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో వారు ప్రచారాన్ని చేస్తున్నారు. తెలుగువాళ్ళయిన రాజు చింతల, శ్రీధర్ చిట్యాల ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తూ, అవసరమైన సమయంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తున్న ట్రంప్‌ను గెలిపించాల్సిందేనంటూ భారతీయ అమెరికన్లు కొందరు ఈ ప్రచారంలోకి దిగారు. ట్రంప్ హయాంలో ఇండియాకు పెరిగిన విశేష ప్రాధాన్యాన్ని, భారత ప్రధాని నరేంద్రమోదీతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేస్తూ ట్రంప్‌కు మద్దతుగా వారు ప్రచారం చేస్తున్నారు. ఇండియన్ కమ్యూనిటీ చెందిన డాక్టర్ మెర్లిన్ కార్సన్ (కో చైర్), హర్మిత్ థిల్లాన్ (కో చైర్), మృణాళిని (కో చైర్), అల్ మాసన్ (కో చైర్), ఆశీష్ అగర్వాల్, హేమంత్ బట్, రాజు చింతల, శ్రీధర్ చిట్యాల, రిక్ దేశాయ్, డేవిద్ ధిల్లాన్ డానీ గైక్వాడ్, డేనియల్ డిసౌజా గిల్, సుహయిల్ ఖాన్, ప్రేమ్ పరమేశ్వరన్, సునీల్ పూరి, డా. మాయాపూరి, ఖుష్బూ రాలీ, డా. సంపత్ శివంగి, సరోజ్ సింగ్ తదితరులు ఈ ప్రముఖుల్లో ఉన్నారు. హిందూవాయిస్ ఫర్ ట్రంప్, సిఖ్ వాయిస్ ఫర్ ట్రంప్ పేరుతో కూడా ప్రచారాన్ని చేస్తున్నారు.
26 రోజులపాటు వీరంతా తమ తమ ప్రాంతాల్లో ట్రంప్‌కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఇండియన్ కమ్యూనిటీని కలుసుకుని ట్రంప్ చేసిన మంచి పనులను వారికి వివరిస్తున్నారు. ట్రంప్ వచ్చిన తరువాత ఇండియా – అమెరికా సంబంధాల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తున్నారు. కొంతమందికి కాల్ చేసి వివరిస్తున్నారు. కొంతమందికి ఇ-మెయిల్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇలా వివిధ మార్గాల్లో ట్రంప్‌కు మద్దతుగా వీరంతా ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.
https://indianvoices.donaldjtrump.com/













