ప్రవాస భారతీయ దంపతులకు అమెరికా అత్యున్నత పురస్కారం
విద్య, వైద్యం, అక్షరాస్యత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రవాస భారతీయ దంపతులకు అమెరికా అత్యున్నత పురస్కారం లభించింది. విద్య, వైద్య రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే రాయ ఎం హిఫింగ్టన్ అవార్డును మేరీ, విజయ్ గొరాడియా దంపతులకు లభించింది. విద్య, ఆరోగ్యంపై కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో వీరు సేవలు అందిస్తున్నారు. గతంలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి ట్రిల్లర్సన్, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్ వంటి ప్రపంచ ప్రముఖులకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. విజయ్ గొరాడియా (67) విన్నర్ ఇంటర్నేషనల్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.













