అమెరికా ఒత్తిడికి తలొగ్గిన ఇండియా!
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకునే విషయమై భారత్ దృష్టి సారించినట్లు ప్రభుత్వ, పారిశ్రామిక అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా, కువైట్ల నుంచి అధికంగా కొనుగోలు చేసేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు. అయితే అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లుగా ఇరాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేసే అవకాశం లేదని తెలిపారు. నవంబరు 4 నాటికి ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతులను సున్నా కు తీసుకురావాలంటూ అన్ని దేశాలకూ అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కొద్ది రోజుల్లో సృష్టత వస్తుందని, అయితే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తూ ఆచితూచి అడుగేయాలంటూ చమురుశుద్ధి కర్మాగారాలకు పెట్రోలియం శాఖ సూచించింది.













