డొనాల్డ్ ట్రంప్ కు భారత్ ఆహ్వానం
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్ ఆహ్వానించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. కాగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వచ్చేనెలలో భారత్ రానున్నట్టు ఆమె ధ్రువీకరించారు. అధ్యక్ష పర్యటన కోసం అవసరమైన సంప్రదింపులు, చర్చలు జరిపేందుకువ వారు భారత్ రానున్నట్లు శాండర్స్ పేర్కొన్నారు. ప్రతియేటా రిపబ్లిక్ డే రోజు ఓ దేశాధినేతను భారత్ ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతోపాటు, సైనిక శక్తిని ప్రదర్శించే ఈ వేడుకలను భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. 65వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 2015లో చీఫ్ గెస్ట్‌గా నాటి అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.













