50 ఏళ్ల నాటి భారతీయ పత్రిక మూసివేత
ఐదు దశాబ్దాలుగా భారతీయ అమెరికన్లకు సేవలందించిన ఇండియా అబ్రోడ్ ప్రింట్ ఎడిషన్ను మూసివేస్తున్నట్లు ఆ పత్రిక యాజమాన్యం ప్రకటించింది. కరోనా కల్లోలంతోపాటు.. యాడ్స్ లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. 1970లో ప్రవాస భారతీయుడు గోపాల్ రాజు స్థాపించిన ఈ పత్రిక.. 50 ఏళ్లుగా అమెరికాలోని ఎన్నారైల మన్ననలు అందుకుంది. రాజకీయ, వాణిజ్యం, సాంకేతికత, సాహిత్యం, వినోదం విభాగాలోల వార్తలను అందించిన ఈ పత్రికను 2011ల రిడిఫ్ డాట్ కామ్ కొనుగోలు చేసింది. 2016లో 8కే మైల్స్ మిడియా ఇంక్ సంస్థ పత్రిక యాజమాన్య హక్కులు పొందింది. సోమవారం (మార్చి 30) నాడు చివరి ప్రింట్ ఎడిషన్ను పాఠకులకు అందజేస్తామని, ఆ తర్వాత కేవలం వెబ్ ఎడిషన్ మాత్రమే కొనసాగుతుందని ఇండియా ఆబ్రోడ్ యాజమాన్యం ప్రకటించింది.













