పొద్దున రాజులా.. రాత్రికి బంటులా!
ఉదయాహారాన్ని మహారాజులా సుష్ఠుగా తినాలి. మధ్యాహ్న భోజనాన్ని పేదవాడి ఆహారంలా తేలిగ్గా తీసుకోవాలి. భారత్లో పూర్వకాలం నుంచి ఉన్న నానుడి ఇది. అమెరికాలోని లాస్ఎంజెల్స్ పరిశోధకులు తాజాగా ఈ విషయాన్నే 50 వేల మందిపై పరిశోధన చేసి చెబుతున్నారు. రోజు మొత్తంలో ఎక్కువ ఆహారాన్ని ఉదయం పూట తినేవారి బరువు అదుపులో ఉంటుంది. అలాకాకుండా, మధ్యాహ్నం ఎక్కువగా తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఉదయం పూట సుష్ఠుగా తింటే, ఆ తరువాత స్వీట్లు, ఇతర చిరుతిళ్లు తినాలనే ఆసక్తి తగ్గుతుంది. ఈ కారణంగా బరువు పెరగరు అని సృష్టం చేస్తున్నారు. రాత్రి భోజనం మానేసి, ముందు రోజు భోజనానికి, తరువాత రోజు ఉదయాహారానికి మధ్య 18 గంటల సమయం ఉండేలా చూసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని సూచించారు. అంటే మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేస్తే, మళ్లీ తరువాత రోజు ఉదయం 6 గంటలకు అల్పాహారం తీసుకోవాలి.













