జీఏటీఎస్ ఆధ్వర్యంలో అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు

గ్రేటర్ అంట్లాంటా తెలంగాణ సొసైటీ (జీఏటీఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 22 ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫార్‌సైత్ సెంట్రల్ హైస్కూల్ వేదికగా ఈ పండుగ జరుపుకోనున్నారు. అందరూ ఈ వేడుకల్లో ఉచితంగా పాల్గొనవచ్చు. ఈ సంబరాల్లో పాల్గొన్న అందరికీ జీఏటీఎస్ డిన్నర్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఫోక్ సాంగ్స్, సంప్రదాయ నృత్యాలు, గౌరీ పూజ, శ్రీరామ పల్లకీ సేవ, ఫైర్ వర్క్స్, కోలాటం వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ వేడుకల్లో అలరించనున్నాయి. అలాగే గ్రూప్, వ్యక్తిగతం, యువత, అమ్మమ్మ-మనుమరాలు జోడీ.. ఇలా వివిధ విభాగాల్లో బతుకమ్మల పోటీల్లో గెలిచిన వారికి 200 డాలర్ల వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు జీఏటీఎస్ వెల్లడించింది.