న్యూజెర్సీలో ఏపీ టూరిజం స్టాల్ కు అనూహ్య స్పందన
న్యూజెర్సీలోని న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన చలో ఇండియా-2018లో ఎక్కువ మంది సందర్శించిన స్టాల్స్‌లో ఏపీ టూరిజం స్టాల్ ఒకటిగా నిలిచింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు న్యూజెర్సీలో భారతీయ సంస్కృతి, పర్యాటక ప్రదేశాల పట్ల అవగాహన కల్పిస్తూ చలో ఇండియా పేరుతో ప్రదర్శన నిర్వహించారు. యూఎస్‌తో పాటు ఇతర దేశాల నుంచి లక్ష మంది సందర్శకులు ఈ ప్రదర్శన తిలకించారు. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్- ఆంధ్రప్రదేశ్ ట్యాగ్‌లైన్‌తో ఏపీ టూరిజం స్టాల్ ఏర్పాటు చేసింది. పర్యాట కులతోపాటు కంపెనీల నుంచి అమితాసక్తిని ఈ స్టాల్ అందుకుంది. ప్రత్యేక మెమొంటోను స్టీవెన్స్ రోజర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.













