నాటా స్పాన్సర్ చేసిన ‘గోవిందా రక్షమాం కరోనాతః’ ప్రపంచ ప్రార్థన
అన్నమాచార్య భావన వాహిని, (భారత్) మరియు ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) సంయుక్తంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి గారి ప్రేరణతో ‘గోవిందా రక్షమాం కరోనాతః’ పేరుతో ప్రపంచ ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒకరు ప్రార్థించడం కన్నా సమష్టిగా మనమంతా కలిసి ప్రార్థించినపుడు ఆ ప్రార్థనకు బలమెక్కువ. కరోనా ఏ ఒక్కరినో, ఏ ఒక్క దేశాన్నో బాధించడం లేదు. యావత్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ప్రపంచంలోని మనుషులందరూ కలిసి చేసిన సమష్టి కర్మ ఫలం ఈ కరోనా.ఈ భయంకర పరిస్థితిని సమిష్టి ప్రార్థనతోనే అధిగమించిగలం.
మే 9వ తేదీన భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గం.లకు మనమంతా కలసి ముక్త కంఠంతో, ఒకే భావంతో, ‘‘గోవిందా రక్షమాం కరోనాతః’’ అంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారు రచించి, సంగీతం సమకూర్చిన ఈ ప్రార్థనా గీతాన్ని భక్తితో అందరిచేత ఆలపింపజేసింది. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినందుకు నాటాకు శ్రీమతి శోభారాజు ధన్యవాదాలు తెలిపారు.













